జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో పర్యటించిన సందర్భంగా, జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్థం అయ్యిందని, భూ రికార్డులు తారుమారు చేశారని, ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు. గత ప్రభుత్వం పశువులకు దాణా కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ అక్రమాలను అరికట్టేందుకే ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లామని, ప్రజలు తమకు చారిత్రాత్మకంగా రికార్డు సీట్లను ఇచ్చారని తెలిపారు. మొదట రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఆ తర్వాత ఇతర సమస్యలపై దృష్టి సారించామని, ప్రస్తుతం వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్