గోపాలపురం మండలం సగ్గొండ గ్రామంలో గురువారం మొక్కజొన్న పంట కోత ప్రయోగం జరిగింది. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఉపగణాoక అధికారి జయభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగంలో, ఎకరానికి 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. పంట కోత ప్రయోగం ద్వారా దిగుబడిని ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ జోడాల వెంకట్, ఉద్యానవన సహాయకులు వెంకటాచారి, రైతులు పాల్గొన్నారు.