ఎర్ర కాలువ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి: దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తూగో జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఎర్ర కాలువ పై నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్