తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జలమయమైన పెద్దాపురం గ్రామాన్ని గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు. స్థానిక ప్రజలతో మమేకమై, వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. ఆయన వెంట ఎన్డీఏ కూటమి నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్ కోర్లపాటి రాము, గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు, మండల నాయకులు పాల్గొన్నారు.