తూ.గో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తాళ్లపూడి మండలంలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతో అల్లాడిన ప్రజలకు ఇది ఉపశమనాన్నిచ్చింది. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, దీపావళి బాణసంచా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.