నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న దొబ్బిది పెద్దిరాజు ఆత్మహత్యకు పాల్పడి తాడేపల్లి గూడెంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక టీడీపీ వార్డ్ మెంబర్ దౌర్జన్యం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ హోంమంత్రి తానేటి వనిత బాధితుడిని గురువారం పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. బాధితుడికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు.