నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఆయన అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.