తొండంగి మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావు అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఈ విషయాన్ని జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. రాజేశ్వరరావు గతంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఈవోపీఆర్డీగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు అధికారులు వెల్లడించారు. తుని ఎంపీడీవోగా ఉన్న సాయి నవీన్ కు తొండంగి ఎంపీడీవోగా ఇన్ఛార్జిగా నియమించారు.