తూగో జిల్లా, నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో నేడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనంతపల్లి గ్రామానికి చెందిన బోయపాటి రమేష్, సుజాత దేవి దంపతులు స్వామివారి కల్యాణానికి నామాలు, అమ్మవార్లకు మంగళ సూత్రాలు, కాళ్ళకి మెట్లు, నల్లపూసలు వంటి బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలను అందించారు. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.