పింఛన్ల పంపిణీలో ముందడుగు: లబ్ధిదారుల హర్షం

దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో బుధవారం జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేశారు. జనవరి 1న ఇవ్వాల్సిన పింఛన్లను ముందుగా ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ రాజమండ్రి పార్లమెంటర్ రైతు సంఘం అధ్యక్షులు ముళ్ళపూడి దొరాజీ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, తాతారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్