గోపాలపురం నియోజకవర్గం, రాజంపాలెం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు గురువుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకోవాలని అన్నారు. అనంతరం మధ్యాహ్నం భోజన పథకం లో పాల్గొని స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కురుకూరి ధనలక్ష్మి పాల్గొన్నారు.