రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ (ఆర్ఎస్ఎస్) శతవసంతాల వేడుకలను పురస్కరించుకుని రాజానగరం మండలం దివాన్ చెరువులో సోమవారం హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. బిజెపి నాయకులు డాక్టర్ రాంబాబు నివాసంలో జరిగిన సమావేశంలో, డిసెంబర్ 21వ తేదీన విశ్వేశ్వరి మాత ఆలయ ఆవరణలో శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, రఘునాధపురం, పాలచర్ల గ్రామాలను కలుపుకొని హిందూ సమ్మేళనం ఉంటుందని సీనియర్ నాయకులు కర్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ శతవసంతాల వేడుకల్లో భాగంగా జరుగుతుంది.