గత కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందని రాజమండ్రి పార్లమెంట్ కార్యదర్శి బళ్ళ సూర్యచక్రం పేర్కొన్నారు. గురువారం ఆయన దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో మాట్లాడుతూ, కూటమి అందిస్తున్న పథకాలు, పనితీరు విజయవంతంగా అమలు అవుతున్నాయని వెల్లడించారు. అనంతరం పార్లమెంటు పరిధి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.