ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుతాం

దేవరపల్లి మండలం కృష్ణంపాలెం బీసీ కాలనీలో ఆదివారం గ్రామ టీడీపీ అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక మచ్చలేని నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఉపాధ్యక్షులు బిక్కిన ఏడుకొండలు, చెల్లింకి వాసు, ఉండవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్