గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గురువారం ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన క్లస్టర్–11 మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన మార్గదర్శనం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.