ద్వారకాతిరుమల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగులో కరపత్రాలు పంపిణీ చేశారు. గత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో, ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం నాయకులు పోలిన శ్రీనివాసరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి రూపేష్ కుమార్ తదితరులు ఉన్నారు.