గోపాలపురంలో మాజీ హోం మంత్రి, గోపాలపురం వైసీపీ ఇన్చార్జ్ తానేటి వనిత 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. గత ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆమె విమర్శించారు. అనంతరం, వైసీపీ బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సు నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వెలగా శ్రీరామ మూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు.