నల్లజర్ల మండలం అనంతపల్లిలో శనివారం ఉదయం జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో డ్రైవర్ కాలు తీవ్రంగా నుజ్జునుజ్జయ్యింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడికి 108 సిబ్బంది లారీలోనే ప్రాథమిక చికిత్స అందించారు. రెండు గంటల పాటు జరిగిన ప్రయత్నాల అనంతరం, ఇతర డ్రైవర్ల సహకారంతో బయటకు తీశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.