గాలి, వాన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన మామిడితోటల రైతులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని సీఐటీయూ జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సీఐటీయూ బృందం దూబచర్ల, పుల్లలపాడు గ్రామాల్లో దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో ఎ. నాగరాజు, యం. పండు, రైతులు తదితరులు పాల్గొన్నారు.