గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆకుపచ్చ చీర ధరించిన మృతురాలి వద్ద బకెట్, బూడిద గుమ్మడికాయ ఉన్నాయని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్