కె. గోపాలపురం గ్రామశివారున పామాయిల్ తోటలో అక్రమంగా జూదాలు ఆడుతున్నట్లు గుర్తించిన ఎస్సై శివనాగబాబు, వాటిని ప్రోత్సహించినా, ఆడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం రాత్రి అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురిని తహసీల్దార్ శ్రీనివాస్ వద్ద బైండోవర్ చేశారు. మిగతా వారి కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.