జగ్గంపేట మండలం నరేంద్రపట్నంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం వృద్ధుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.