రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం గుర్రంపాలెం పంచాయతీ పరిధిలో సొంత భూమి ఉన్న రైతులకు బుధవారం పట్టాదారు పాసు పుస్తకాలను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వే చేసి పాసు పుస్తకాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్