చిన్నారిని కాలువలో పడేసిన తండ్రి UPDATE

కాకినాడ జిల్లా, జగ్గంపేటలో ఓ చిన్నారిని తండ్రి కాలువలో పడేసిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో ఉన్న మణికంఠ అనే వ్యక్తి, తన 11 నెలల కుమార్తెను బైక్‌తో సహా పోలవరం కాలువలో దూకేశాడు. స్థానికులు గమనించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, మణికంఠ మద్యానికి బానిసై భార్యాపిల్లలను హింసిస్తున్నట్లు సమాచారం. ఉయ్యాలలో నిద్రపోతున్న 11 నెలల చిన్నారిని బైక్ పై తీసుకుని వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్