ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తే కేసులా: పాటంశెట్టి

జగ్గంపేటలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇండిపెండెంట్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మట్టి, ఇసుక తవ్వకాల ద్వారా భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. శృంగరాయనిపాలెం వద్ద ఏలేరు నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను మంగళవారం అడ్డుకుని, అక్కడ ఉన్న ప్రోక్లెయిన్‌లు, లారీలను నిలిపివేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్