జగ్గంపేట ప్రభుత్వ ఐటీఐలో 2025–26 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ఎల్.ఆర్.ఆర్. కృష్ణన్ సోమవారం తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 20న సాయంత్రం 5లోపు iti.ap.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో 23న కౌన్సెలింగ్‌కు రావాలన్నారు.