వైసీపీ జగ్గంపేట మండల ఉపాధ్యక్ష, కార్యదర్శులను కేంద్ర పార్టీ నియమించింది. మండల ఉపాధ్యక్షుడిగా భూమాడి గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా సప్ప రఘునాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు ఆదివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహంను కలిశారు. పార్టీ బాధ్యతలను అప్పగించినందుకు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరుటూరి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.