కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికే పెద్దపీట వేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాట్రావులపల్లిలో శనివారం రాత్రి జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామానికి రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.