జగ్గంపేట: రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

జగ్గంపేట మండలంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎలక్ట్రికల్ ఏఈ వీరభద్రరావు గురువారం మీడియాకు తెలిపారు. రాజపూడి హెడ్ క్వార్టర్స్ ఫీడర్, 11 కేవీ జగ్గంపేట, నరేంద్రపట్నం ఫీడర్ల పరిధిలో చెట్లు నరికివేత, మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని ఆయన చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్