జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం సైబర్ నేరాలపై సీఐ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. దేవాలయం లాంటి విద్యాలయాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ గురించి వివరించి, దానిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.