జగ్గంపేటలో నూతనంగా నిర్మించిన సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం ప్రారంభించారు. విద్యార్థినులతో ముచ్చటించిన ఆయన చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. రామవరంలోని పాత వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.