జగ్గంపేట: అమరావతిలో విశ్వబ్రాహ్మణులకు ఉపాధి కల్పించాలి

గండేపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సోమవారం రాత్రి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతిపత్రం అందజేశారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిలో విశ్వబ్రాహ్మణులకు ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్