జగ్గంపేటలోని ఎస్సీ హాస్టల్ ను వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్లో నెలకొన్న అనేక సమస్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో సమస్యల కారణంగా విద్యార్థులు విష జ్వరాల బారిన పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.