జగ్గంపేటకు 'మహాప్రస్థానం' వాహనం: ఎమ్మెల్యే జ్యోతుల

జగ్గంపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పాలకుర్తి సురేశ్-ఆదిలక్ష్మి దంపతులు గ్రామపంచాయతీకి రూ. 10 లక్షల విలువైన 'మహాప్రస్థానం' వాహనాన్ని విరాళంగా అందజేశారు. ఈ వాహనాన్ని సోమవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. పేద ప్రజల అంతిమయాత్రకు ఉపయోగపడేలా ఈ వాహనాన్ని సమకూర్చడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ దాతృత్వాన్ని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్