కిర్లంపూడి కళాశాలలో మోటార్ల చోరీ

కిర్లంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఒకేషనల్ కోర్సు ప్రాక్టికల్ లేబరేటరీలో 6 మోటార్లు చోరీకి గురైనట్టు ప్రిన్సిపల్ కాంచనమాల తెలిపారు. దుండగులు కిటికీ ఊచలు తప్పించి ఈ చోరీకి పాల్పడ్డారని, DC మోటార్లు 4, AC మోటార్లు 2 పట్టుకుపోయారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్