ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ఆర్జేడీ నాగమణి సమీక్ష

కిర్లంపూడి మండల కేంద్రంలోని కొక్కండ రామశాసగిరి రావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) జి. నాగమణి సోమవారం సందర్శించారు. పీఎం శ్రీ పాఠశాల కింద కల్పించిన స్మార్ట్ తరగతులు, లైబ్రరీ, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా వసతులు, తాగునీరు, కిచెన్ గార్డెన్, ఫర్నిచర్ తదితర సౌకర్యాలను ఆమె పరిశీలించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని తెలుసుకుని, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, సంక్షేమ పథకాలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్