కిర్లంపూడిలో వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆయన విమర్శించారు. జూన్ 4 నుంచి 12 వరకు మండలాలు, నియోజకవర్గ స్థాయిలో నిరసన కార్యక్రమాలు, భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.