తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం కె. సూరంపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి శివసూర్యనారాయణ (24) అనే యువకుడు సోమవారం పి. నాయకంపల్లి గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి తాపీ పనికి వెళ్ళాడు. పిట్టగోడ నిర్మాణంలో భాగంగా ఐరన్ ఊసలు తీసుకుని మేడపైకి ఎక్కుతుండగా, 11 కేవీ విద్యుత్ వైర్లు ఊసలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మేనమామ వీరసత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ నాగబాబు తెలిపారు.