కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. 2025–26లో ఇంజినీరింగ్‌కి 62,000, ఫార్మసీకి 3,950, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 16,068 సీట్లు ఉండే అవకాశం ఉందన్నారు. వెబ్ ఆప్షన్ల కోసం ఈనెల 18 వరకు సమయముంది, విద్యార్థులు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలన్నారు.