అధిక ఉష్ణోగ్రతలతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కాకినాడ జిల్లాలోని 14 మండలాల్లో రానున్న అయిదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరేందిరప్ర సాద్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో తాళ్లరేవు, కరప, కాజులూరు, కాకినాడ అర్బన్, రూరల్, పిఠాపురం, యు. కొత్తపల్లి, గొల్లప్రోలు, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, పెదపూడి, సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఎండలోకి వెళ్లొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి పట్టునే ఉండాలని సూచించారు. వడదెబ్బ తగిలితే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్