ఉపాధి హామీ చట్టంపై బీజేపీ నిర్లక్ష్యం: సీపీఎం ఆరోపణ

తూరంగిలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా సీపీఎం పార్టీ, ఉపాధి కార్మికులు నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ పార్టీ నాయకులు సిహెచ్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, బీజేపీ పాలనలో ఉపాధి హామీ చట్టం నిర్లక్ష్యానికి గురైందని, 2025 కొత్త చట్టం కార్మికుల హక్కులను హరిస్తుందని ఆరోపించారు. నిధులు తగ్గించారని, పని దినాలు తగ్గించడం ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేయడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. కేంద్రం కొత్త చట్టాన్ని ఉపసంహరించి, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో సంతకాల సేకరణ, 3న వినతి పత్రాలు, 5న ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగా అప్పారావు, పితాని లక్ష్మి, టేకు మూడి సత్యకుమారి, పలివెల సుభద్ర, హరిత, గోవింద్, ఆదిలక్ష్మి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్