కాకినాడలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో నిర్మాణ రంగం కుదేలైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఇంధన లభ్యత లేక ట్రాన్స్‌పోర్ట్ లారీలు, ట్రాక్టర్లు పనిచేయలేక నిర్మాణ పనులు నిలిచిపోయాయని, పెట్రోల్ బంకుల్లో డీజిల్ ఉన్నా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇంధన సరఫరాను సక్రమం చేయాలని డిమాండ్ చేశారు.