ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది: ఎమ్మెల్యే కొండబాబు

గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు, అక్రమ కేసులకు పాల్పడినా తట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో టీడీపీ శ్రేణులు కీలక పాత్ర పోషించాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్తలకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్