పండుగ రోజూ వీడని దీక్ష: జీజీహెచ్ సెక్యూరిటీ గార్డుల నిరసన

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్) సెక్యూరిటీ గార్డులు చేపట్టిన నిరాహార దీక్షలు శ్రీరామనవమి పండుగ రోజున కూడా కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటి దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజకుమార్ ప్రారంభించి, విధుల నుంచి అన్యాయంగా తొలగించిన గార్డులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్