బాలిక మృతి: రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేత

కాకినాడ రూరల్ మండలం పి. వెంకటాపురం గ్రామానికి చెందిన కేంద్రీయ విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్న 9 ఏళ్ల కంచపు లక్ష ఐశ్వర్య గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, తన ఫౌండేషన్ ద్వారా బాలిక కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయాన్ని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ గురువారం సాయంత్రం బాలిక నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్