అనంతబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా

సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై కాకినాడ మొబైల్ కోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను కోర్టు మే 6కు వాయిదా వేసింది. అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, ఆ పిటిషన్‌ను మొబైల్ కోర్టులోనే దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. మరోవైపు, సాక్షుల బెదిరింపు కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనంతబాబు మరో పిటిషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్