రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలోని 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి. గడ్డి, పొలాలు, తడి నేలలు, చెత్తతో ఉన్న ప్రదేశాల్లో కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో 140కి పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉన్నట్లుండి జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్లు నొప్పులు, విరేచనాలతో పాటు పలు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.