కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా కార్యకర్తలకు గుర్తింపుతో పాటు బీమా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. సోమవారం కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో సిటీ క్యాడర్ తో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, ప్రతి కార్యకర్త దీనిని బాధ్యతగా స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.