కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో నలుగురు నిందితులను సస్పెండ్ చేశామని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ప్రధానంగా కల్యాణ్ చక్రవర్తిపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ఆయనతో పాటు జమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లపై కూడా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేశామని శుక్రవారం ఉదయం మూడు ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. నలుగురు వేధిస్తున్నారని 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.