కాకినాడ: అంతర్జాతీయ చెస్ మాస్టర్ గా అజయ్

సెర్బియాలో ఈ నెల 12 వరకు జరిగిన అంతర్జాతీయ చెస్ పారాసిన్ ఓపెన్ టోర్నమెంట్‌లో కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ముషిని అజయ్ ప్రతిభ కనబరిచాడు. 2450 ఫిడే రేటింగ్ సాధించి అంతర్జాతీయ చెస్ మాస్టర్ హోదా పొందాడు. కాకినాడ డెవలప్ చెస్ అకాడమీలో కోచ్‌గా పని చేస్తూ, అనేక పోటీల్లో పాల్గొంటున్న అతనిని కోచ్ దివ్యతేజ అభినందించారు.

సంబంధిత పోస్ట్